Skip to main content

జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై కమిషనర్ సమీక్ష

.                        కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్నం డిసెంబర్ 04: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికే పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధానకార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పై అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ నగరంలో జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ వర్క్లు, మెకానికల్ పనులు, తాగునీటి సరఫరా మొదలైన వాటిపై సుధీర్ణంగా చర్చించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అలాగే అభివృద్ధి పనుల అంచనాలను తయారు చేసేటప్పుడు పూర్తి వివరాలను పొందుపరచాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులకు అదనంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని, సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రాంట్లు, బడ్జెట్లకు అనుగుణంగా అవసరం ఉన్నచోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సంబంధించి ఎంత కేటాయింపు జరిగింది ఎంత ఖర్చు చేశారు. ఎంత విడుదల కావలసి ఉంది అని అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ఆలస్యంపై కమిషనర్ అధికారులను అడిగి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పి.జె.ఆర్.ఎస్. లో రోడ్లు పై గుంతలు కాలువలు తాగునీటి విభాగంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు వసూలు చేయాలని, సుదీర్ఘకాలం నీటి చార్జీలు చెల్లించని వారి నీటి కనెక్షన్లకు ముందుగా నోటీసులు జారీ చేసి అనంతరం తొలగించాలని ఆదేశించారు. అనంతరం బీచ్ రోడ్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రాజెక్టుల అమలుపై ఎస్ ఆర్ యు టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కమిషనర్ తిలకించారు. APUIML, SRU టీం, ఇంజనీరింగ్ విభాగంతో సంయుక్తంగా విశాఖ నగర అభివృద్ధికి పలు వినూత్న ప్రాజెక్ట్ లను సూచించి తగు ప్రణాలికలను సిద్దం చేయాలన్నారు.

ఈ సమీక్షలో జీవీఎంసీ కార్యనిర్వహక ఇంజనీర్లు ఉపకార్య నిర్వహణ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. 

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ.

Comments

Popular posts from this blog

पूर्व सैनिकों एवं उनके परिवारों को निर्बाध स्वास्थ्य सेवाएं सुनिश्चित करने हेतु ईसीएचएस (ECHS) के फंड तत्काल जारी करने का किया अनुरोध किया …

.               डॉ राघवेंद्र मिश्रा कार्यपालक संपादक डॉ. चन्द्र शेखर, राष्ट्रीय संयोजक (वेटरन्स) ने माननीय रक्षा मंत्री, वित्त मंत्री तथा रक्षा मंत्रालय के भूतपूर्व सैनिक कल्याण विभाग के सचिव को पत्र लिखकर पूर्व सैनिकों एवं उनके परिवारों को निर्बाध स्वास्थ्य सेवाएं सुनिश्चित करने हेतु ईसीएचएस (ECHS) के फंड तत्काल जारी करने का अनुरोध किया है। ईसीएचएस में चल रही धन की कमी एक गंभीर चिंता का विषय बन गई है, जिससे हमारे लाभार्थियों के उपचार में बाधाएं आ रही हैं। अपने पूर्व सैनिकों और उनके परिवारों को ऐसे विलंब का सामना करते देखना अत्यंत पीड़ादायक है। मैं हमारे समुदाय के सभी सम्मानित एवं प्रभावशाली सदस्यों से निवेदन करता हूं कि वे अपने-अपने सांसदों से संपर्क करें और इस विषय को उचित स्तर पर उठाने का आग्रह करें। फंड जारी करना ओआईसी के नियंत्रण से बाहर है, फिर भी रोजाना मरीजों के सवालों और पीड़ा का सामना उन्हें ही करना पड़ रहा है। आइए, हम सभी मिलकर इस महत्वपूर्ण व्यवस्था के सुचारु संचालन को सुनिश्चित करने के लिए हर संभव प्रयास करें। स्वास्थ्य हर परिवार और ह...