Skip to main content

Indian Navy: ప్రతి 40 రోజులకు ఓ కొత్త యుద్ధనౌక: నేవీ చీఫ్

.                            కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖ సందేశం వార్తలు : ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌకను లేదా జలాంతర్గామిని భారత నౌకాదళం (Indian Navy)లోకి చేర్చుతున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి వెల్లడించారు. సముద్ర జలాల్లో భద్రతా సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సామర్ధ్యాల పెంపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. నౌకాదళంలో 'స్వావలంబన'ను ఓ వ్యూహంగానే కాకుండా, భవిష్యత్తు భరోసాకు పెట్టుబడిగా చూస్తున్నట్లు చెప్పారు.

"సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌకను లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం. 2035 నాటికి 200కు పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఆర్డర్ చేసిన 52 నౌకలన్నీ మన షిప్యార్డలోనే నిర్మాణ దశలో ఉన్నాయి" అని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అడ్మిరల్ త్రిపాఠి తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశీయంగా రక్షణ ఉత్పత్తుల విలువ మూడు రెట్లు పెరిగి గత ఏడాది రూ.1.5 లక్షల కోట్లు దాటిందన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్ వద్ద 145 యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.

ఏ నౌకాదళానికైనా స్వావలంబన, సమన్వయం, భద్రత అనేవి మూడు ప్రధాన స్తంభాలని అడ్మిరల్ త్రిపాఠి పేర్కొన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్ధ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతలు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత పారిశ్రామిక వ్యవస్థలో సెమీకండక్టర్లు కూడా సబ్మెరైన్ల మాదిరి కీలకంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు

Comments

Popular posts from this blog

मानस गंगा पूज्या प्रियंका पांडेय जी द्वारा आज भक्तमाल की कथा में श्री नारद जी के मोह का वर्णन *

.         विशाखापत्तनम: विशाखापत्तनम दर्पण समाचार: माया महा ठगिन हम जानी , माया एवं प्रेम के अंतर को समझते हुए आज कथा वक्ता मानस गंगा पूज्या प्रियंका पांडेय जी ने कहा काम, क्रोध,मद और लाभ ये चार नर्क के मार्ग हैं। माया ने नारद को भी चक्कर में डाल दिया और संत शिरोमणि बाबा नारद भी विवाह न हो पाने का वियोग नहीं सह पाए और श्री हरि विष्णु को स्त्री वियोग का श्राप दे दिया जिसके कारण श्री हरि को श्री राम जी का अवतार लेकर सीता जी के वियोग में वन वन भटकना पड़ा ।  *हे खग मृग हे मधुकर श्रेणी तुम देखी सीता मृग नयनी ।* भगवान शिव एवं माता पार्वती के कथा को सुनाते हुए श्रीमती वक्ता ने कहा कि भगवान शिव ने सती को  सीता जी के रूप धारण करने पर उन्होंने सती जी का परित्याग कर दिया एवं बामांग में न बैठा कर अपने सम्मुख बैठाया जिसके कारण मां सती को अपने शरीर का त्यागना पड़ा ।     कथा मंच के कुशल खेवहिया पूर्वांचल कीर्तन मंडली एवं पूर्वांचल पूजा समिति विशाखापत्तनम के संस्थापक एवं सूत्रधार श्री भानु प्रकाश चतुर्वेदी जी ने अपने वक्तव्य में कहा हम रहे न रहें पर ये ...