Skip to main content

వార్తల్లో విశ్వసనీయత ఉంటేనే విలువ* - *టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు* - *ఎస్సీఆర్డబ్ల్యూఏ గాజువాక యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్లు పంపిణీ*

 


గాజువాక, డిసెంబర్ 27)* పాత్రికేయులు రాసే వార్తలు విశ్వసనీయత ఉండాలనితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రింట్,  ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు విశ్వసిస్తారని ఆయన చెప్పారు. వార్తల్లో విశ్వసనీయత కోల్పోతే పాత్రికేయుడు లేదా ఆ సంస్థకు విలువ తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  గాజువాకలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్సీఆర్డబ్ల్యూఏ డైరీ - 2026 ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పాత్రికేయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజమైన వార్తలను అందించాలని ఆయన సూచించారు. తప్పుడు వార్తలు సమాజం పై తీవ్ర ప్రభావం 

చూపిస్తాయని ఆయన ఆందోళన అన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభం గా ఉన్న పాత్రికేయులు సమాజానికి వెన్నుముక గా నిలవాలని పిలుపు నిచ్చారు.  ఆ దిశగా స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పారిశ్రామిక కేంద్రానికి కేంద్ర బిందువుగా ఉన్న గాజువాకలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ గడచిన దశాబ్ద కాలంగా పాత్రికేయుల సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం సహా  పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తూ విలువలతో కూడిన పాత్రికేయులు తయారు చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు అశోక్ చెప్పారు. అనంతరం ఎస్సీఆర్డబ్ల్యూఏ గాజువాక యూనిట్ సభ్యులకు అతిథులు చేతుల మీదుగా డైరీలు ,స్వీట్లు పంపిణీ.. అనంతరం


టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అసోసియేషన్ సభ్యులు దుస్సాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్, 

గాజువాక టీడీపీ ఇంచార్జి ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు ,గాజువాక టీడీపీ మహిళ ఉపాధ్యక్షురాలు కోరుకొండ పద్మ, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి కర్రి సత్యనారాయణ (సత్య), ఉపాధ్యక్షురాలు  శిరీష, సెక్రెటరీ వసంత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జయరాం తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

मानस गंगा पूज्या प्रियंका पांडेय जी द्वारा आज भक्तमाल की कथा में श्री नारद जी के मोह का वर्णन *

.         विशाखापत्तनम: विशाखापत्तनम दर्पण समाचार: माया महा ठगिन हम जानी , माया एवं प्रेम के अंतर को समझते हुए आज कथा वक्ता मानस गंगा पूज्या प्रियंका पांडेय जी ने कहा काम, क्रोध,मद और लाभ ये चार नर्क के मार्ग हैं। माया ने नारद को भी चक्कर में डाल दिया और संत शिरोमणि बाबा नारद भी विवाह न हो पाने का वियोग नहीं सह पाए और श्री हरि विष्णु को स्त्री वियोग का श्राप दे दिया जिसके कारण श्री हरि को श्री राम जी का अवतार लेकर सीता जी के वियोग में वन वन भटकना पड़ा ।  *हे खग मृग हे मधुकर श्रेणी तुम देखी सीता मृग नयनी ।* भगवान शिव एवं माता पार्वती के कथा को सुनाते हुए श्रीमती वक्ता ने कहा कि भगवान शिव ने सती को  सीता जी के रूप धारण करने पर उन्होंने सती जी का परित्याग कर दिया एवं बामांग में न बैठा कर अपने सम्मुख बैठाया जिसके कारण मां सती को अपने शरीर का त्यागना पड़ा ।     कथा मंच के कुशल खेवहिया पूर्वांचल कीर्तन मंडली एवं पूर्वांचल पूजा समिति विशाखापत्तनम के संस्थापक एवं सूत्रधार श्री भानु प्रकाश चतुर्वेदी जी ने अपने वक्तव्य में कहा हम रहे न रहें पर ये ...