గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించిన ఎంపీ సి.ఎం. రమేష్*
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఎంపీ సి.ఎం. రమేష్ గారు దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.
అనకాపల్లి జిల్లాలకు గోదావరి జలాలు చేరిన సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో అనకాపల్లి జిల్లాలకు గోదావరి జలాలు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతోనే గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరాయని, జలాలు వచ్చిన సందర్భంగా స్వామివారికి మొక్కు చెల్లించుకున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ సి.ఎం. రమేష్ తెలిపారు.

Comments
Post a Comment